సాధించిన విజయాలు
2013 సంవత్సరం నాటికి పిఎసిఎస్ పోతుగల్ 73 లక్షల రూపాయల నష్టంలో ఉంది.
2013 సంవత్సరం ఫిబ్రవరిలో శ్రీ తన్నీరు బాపురావు అధ్యక్షతన వారి పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తరువాత సంఘం రూపు రేఖలు మారిపోయినవి.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ .కె.సి.ఆర్ గారి ఆశీర్వాదంతో ఐటి మంత్రి శ్రీ. కె. తారక రామారావు గారు, అప్పటి యం.పి ఇప్పటి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ. బి.వినోద్ కుమార్ గారు, సహకార సంఘాల జాతిపిత TSCAB చైర్మన్ శ్రీ.కె.రవీందర్ రావు గారు, వీరందరి సహకారంతో గత ఏడు సంవత్సరాలుగా ఎన్నొ రకాల సేవలను రైతులకు అందిస్తు ముందుకు పోవుచున్నాము.
సంఘ అభివృద్ధి గురించి నిధుల కోసం అధ్యక్షుడు శ్రీ టి.బాపురావు 2013 లో అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఐటి మంత్రి శ్రీ కె. తారక రామారావు గారిని కలిశారు. వెంటనే అప్పటి కెడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ కె. రవీందర్ రావు గారికి ఫోన్ చేసి సొసైటీకి 50 లక్షల రూపాయల రుణం ఇప్పించారు.
ఆ 50 లక్షలతో అధ్యక్షుడు శ్రీ టి.బాపు రావు మరియు పాలకవర్గం కష్టపడి అన్ని రకాల రుణాలు రైతులకు ఇవ్వడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది.
2013 కు ముందు, సొసైటీకి 2 వరి ధాన్యం సేకరణ కేంద్రాలు మరియు 2 ఎరువుల పంపిణీ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మంత్రి శ్రీ. కె. తారక రామారావు గారి సహకారంతో సొసైటీకి 7 వరి ధాన్యం సేకరణ కేంద్రాలు, 8 విత్తనాల పంపిణీ కేంద్రాలు, 8 ఎరువుల విక్రయ కేంద్రాలు సమకూరినవి.
2013 కి ముందు, పిఎసిఎస్ పోతుగల్ రైతులకు పంట రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలను మాత్రమే ఇచ్చింది. 2013 తరువాత శ్రీ టి.బాపురావు మరియు పాలకవర్గం కృషితో సొసైటీలో రైతులకు వ్యక్తిగత, తనఖా, ద్విచక్ర వాహనం, ఫోర్ వీలర్, బంగారం మరియు స్వల్పకాలిక రుణాలను అందించడం తో పాటు ఫిక్స్ డిపాజిట్, లాకర్ మరియు పొదుపు ఖాతాల సేవలు రైతులకు అందించడం జరిగింది.
కార్యాలయం పాత భవనం
2016 వరకు సంఘ కార్యాలయం అద్దె భవనంలో వుండేది.
గౌరవ అప్పటి ఎంపీ శ్రీ బి.వినోద్ కుమార్ గారు తన ఎంపి నిధుల నుండి 15 క్షల రూపాయలను సంఘ భవనం కోసం ఇవ్వడం జరిగింది. మిగితా డబ్బులు సంఘం నుండి కలిపి కొత్త కార్యాలయంను ఆధునిక సాంకేతికతను జోడించి నిర్మించడం జరిగింది.
ఈ కార్యలయ భవనం 18/09/2017లో ఐటి మంత్రి శ్రీ. కె. తారక రామారావు గారు మరియు TSCAB చైర్మన్ శ్రీ.కె.రవీందర్ రావు గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం హర్షనీయం.
కార్యాలయం కొత్త భవనం
కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్రంలోనే మొదటి సారిగా ప్రతిష్టాత్మక రైతు విగ్రహం నెలకొలపడం జరిగింది. రైతు విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత ఆ విగ్రహం చూసి మంత్రివర్యులు ముగ్దులైనారు.
2013 వరకు, పిఎసిఎస్ పోతుగల్ మొత్తం టర్న్ ఓవర్ 4 కోట్లు. ఇప్పుడు టర్న్ ఓవర్ 2020 ఫిబ్రవరి వరకు 14 కోట్లకు చేరుకుంది. సమీప భవిష్యత్తులో 25 కోట్ల లక్ష్యాన్ని చేరడానికి ప్రణాళిక సిధ్దం చేసుకుంది.
పిఎసిఎస్ పోతుగల్ సొసైటీ అవూనూర్ గ్రామంలో 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో భారీ గోడౌన్‌ను నిర్మించింది. ఈ గోడౌన్లో రైతులకు పంపిణీ చేయాల్సిన విత్తనాలు మరియు ఎరువులను నిల్వ చేస్తారు.
మరియు బదనకల్ గ్రామంలో 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండవ గోడౌన్‌ను నిర్మించారు.
31/03/2018 ఆవునూర్ గోడౌన్
బందనకల్ గోడౌన్
అప్పటి గౌరవ ఎంపి శ్రీ బి.వినోద్ కుమార్ గారు మరియు TSCAB అధ్యక్షులు శ్రీ కొండూరి రవీందర్ రావు గార్ల సహకారంతో గూడెం - ఆవునూర్ రోడ్ లో భారత్ పెట్రోలియం వారి సహకారంతో పెట్రోల్ బంక్ నెలకొలపడం జరిగింది
ఇందులో నాణ్యమైన డీజిల్ మరియు పెట్రోల్ లభించును
మరియు అదే కాకుండా
ముస్తాబాద్ - సిద్దిపేట రహదారిపై భారత్ పెట్రోలియం వారి సహకారంతో రెండవ పెట్రోల్ బంక్ పనులు జరుగుతున్నవి.
గుడెం - అవూనూర్ రోడ్ పెట్రోల్ బంక్ (బిపిసిఎల్)
రాబోయే ముస్తాబాద్ - సిద్దిపేట రోడ్ పెట్రోల్ బంక్ (బిపిసిఎల్)
భవనం లోపల సౌర లైటింగ్
నాబార్డ్ మరియు కెడిసిసి రిటైర్డ్ సిఇఒ శ్రీ ఎన్.సత్యనారాయణరావు గారి సహకారంతో పిఎసిఎస్ కార్యలయ భవనంలో సౌరశక్తితో కూడిన విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది.
రైతులతో సిబ్బంది ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా మరియు విధేయులుగా ఉంటారు.
కార్యలయంలో అన్ని ఆన్‌లైన్ సేవలతో పేపర్‌లెస్ లావాదేవీలు.
తెలంగాణ రాష్ట్రంలో, డ్రెస్ కోడ్, హెల్త్ కార్డ్ మరియు సిబ్బందికి బీమా సౌకర్యం కలిపించిన మొదటి సొసైటీ పిఎసిఎస్ పోతుగల్.
సిబ్బందికి హెల్త్ కార్డ్స్ పంపిణి
ఇంతటి సంఘ పురోభివృద్దికి సహకరించిన రైతులకు, ఇంతకు ముందు పని చేసిన అధ్యక్షులు మరియు పాలకవర్గాలకు, ప్రస్తుత పాలకవర్గానికి, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, డిసిఓ శ్రీ. బుద్ధ నాయుడు గారికి, కెడిసిసి బ్యాంక్ రిటైర్డ్ సిఇఓ ఎన్.సత్యనారాయణ రావు గారికి, కెడిసిసి జిఎం శ్రీ శ్రీధర్ గారికి, బ్రాంచ్ మేనేజర్స్ శ్రీ.దామోధర్ మరియు శ్రీ.ఎం.శ్రీనివాస్ రెడ్డి గార్లకు, సంఘ సిబ్బందికి ధన్యవాదములు తెలియజేయుచున్నాము.